Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటి సంరక్షణకు చర్యలు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:50 AM జాతీయంGeneral
వర్షపు నీటి సంరక్షణకు చర్యలు - Ushodayam
వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్రం ‘క్యాచ్ ద రెయిన్’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 1.55 కోట్లకు పైగా నీటి నిల్వ, భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టినట్లు పీఐబీ వెల్లడించింది. తొలి దశలో 23 లక్షల నిర్మాణాలపై అధ్యయనం చేసి, 243 కోట్ల ఘనపు మీటర్ల నీరు భూగర్భంలో చేరినట్లు అంచనా వేసింది. ప్రజల భాగస్వామ్యంతో జల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపింది.

Comments

G
Loading comments...