Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో గ్లాసు మోస్తూ జనసేన అభ్యర్థి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:23 PM విశాఖపట్నంGeneral
విశాఖలో గ్లాసు మోస్తూ జనసేన అభ్యర్థి ప్రచారం - Ushodayam
జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖ 40వ వార్డు జనసేన అభ్యర్థి భీశెట్టి వసంతలక్ష్మి వినూత్నంగా ప్రచారం చేశారు. పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ గాజు గ్లాసు నమూనాను వీపునకు తగిలించుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థే స్వయంగా పెద్ద గ్లాసును మోస్తూ వార్డులో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఆమె ప్రచారం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.

Comments

G
Loading comments...