Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా టికెట్‌ దక్కలేదని అరగుండుతో నిరసన

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 7:08 AM విశాఖపట్నంGeneral
వైకాపా టికెట్‌ దక్కలేదని అరగుండుతో నిరసన - Ushodayam
విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపా టికెట్‌ దక్కకపోవడంతో మాజీ కార్పొరేటర్‌ బిపిన్‌ కుమార్‌ జైన్‌ వినూత్న నిరసన చేపట్టారు. బుధవారం డాబాగార్డెన్స్‌లోని 39వ డివిజన్‌లో అరగుండు కొట్టించుకుని రోడ్డుపై భిక్షాటన చేశారు. పార్టీకి విధేయంగా పనిచేసినా టికెట్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేసి అప్పులపాలయ్యానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా డబ్బులు లేవని తెలిపారు.

Comments

G
Loading comments...