Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటర్‌ హీటర్‌తో వివాహిత మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:58 PM హైదరాబాద్General
వాటర్‌ హీటర్‌తో వివాహిత మృతి - Ushodayam
హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో వాటర్‌ హీటర్‌ తగిలి అయేషాబేగం అనే వివాహిత మృతి చెందింది. ఆదివారం సాయంత్రం స్నానానికి నీటిని వేడి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రెండు నెలల పసిబాబు ఏడుపులు విన్న పొరుగువారు వచ్చి చూడగా ఆమె మృతి చెంది ఉంది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...