Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:57 AM మహబూబాబాద్ General
వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన - Ushodayam
తొర్రూరు మండలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి వాతావరణం మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్నబ్‌ తుపాన్‌ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలు వారిని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, రైతులు ధాన్యాన్ని కల్లాల వద్దకు చేర్చారు. వర్షం కురిస్తే ధాన్యం తడిసి నష్టం వాటిల్లుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...