Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచితంగా డయాలసిస్ సేవలు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 8:27 AM మహబూబ్‌నగర్General
ఉచితంగా డయాలసిస్ సేవలు - Ushodayam
మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (ఎంజీజీహెచ్)లో కిడ్నీ బాధితులకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా నాణ్యమైన డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 10 ఆధునిక యంత్రాలతో 53 మంది రోగులు వారానికి మూడు రోజులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెలకు రూ.60 వేల వరకు ఖర్చయ్యే డయాలసిస్‌తో పాటు ఇంజక్షన్లు, మందులను కూడా ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు.

Comments

G
Loading comments...