Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంకమల అడవుల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ముగ్గురు అదుపులో

Follow Ushodayam on Google
SHRUTHI Aug 28, 2026 7:50 PM కడపGeneral
లంకమల అడవుల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ముగ్గురు అదుపులో - Ushodayam
బద్వేల్ పరిధిలోని లంకమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులను చూసి ఎనిమిది మంది పారిపోయేందుకు ప్రయత్నించగా, ముగ్గురిని వెంబడించి పట్టుకున్నారు. వారిని మనోజ్‌కుమార్‌, వెంకటాద్రి, శివకుమార్‌గా గుర్తించారు. పరారైన మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...