Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరిపల్లిలో అసంపూర్తిగా వెల్నెస్ సెంటర్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:11 PM ఏలూరుGeneral
సరిపల్లిలో అసంపూర్తిగా వెల్నెస్ సెంటర్ - Ushodayam
గణపవరం మండలం సరిపల్లిలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం స్లాబ్ దశలోనే నిలిచిపోయింది. 2020 ఆగస్టు 10న రూ.79.30 లక్షలతో సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్‌లకు శంకుస్థాపన చేశారు. మిగతా భవనాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ మార్పు, నిధుల కొరతతో వెల్నెస్ సెంటర్ పనులు ఆగిపోయినట్లు స్థానికులు తెలిపారు. తక్షణమే నిధులు కేటాయించి భవనాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...