Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలంలో సహస్రనామ అర్చన

Follow Ushodayam on Google
Anuroop Oct 07, 2026 11:34 AM విశాఖపట్నంGeneral
సింహాచలంలో సహస్రనామ అర్చన - Ushodayam
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సహస్రనామ అర్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో అర్చన నిర్వహించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...