Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి

Follow Ushodayam on Google
P. Srinivas Reddy Oct 06, 2026 10:25 AM నారాయణపేటGeneral
రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి - Ushodayam
మద్దూరు పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయే నిరుపేదలకు న్యాయం చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బాధితులకు నష్టపరిహారం, పునరావాసం, ప్రత్యామ్నాయ ఇంటి స్థలం, పక్కా ఇళ్లు కల్పించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు భవానీ శంకర్ మాట్లాడుతూ పేదల న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...