
కుంభం
Aquarius Horoscope
ఈరోజు కుంభం రాశి ఫలాలు (06-11-2026)
విధులు, బాధ్యతల నిర్వహణలో మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు. ఉద్యోగ రంగంలో ఎదురయ్యే పోటీని ధైర్యంగా అధిగమిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో భాగస్వాముల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టాలి. కుటుంబ సమస్యల పరిష్కారంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కొన్ని ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకూడదు. మీ అనుభవం, ఆత్మవిశ్వాసంతో క్లిష్ట పరిస్థితులను అధిగమించి ముందుకు సాగుతారు. శనైశ్చరస్వామి ఆరాధన శుభఫలితాలను అందిస్తుంది.
