Menu
కర్కాటకం

కర్కాటకం

Cancer Horoscope

ఈరోజు కర్కాటకం రాశి ఫలాలు (06-11-2026)

మీ స్వీయ చొరవతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ పురోగతి సాధిస్తాయి. వృత్తిపరమైన వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుని కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు అనుకూలమైన అవకాశాలు, వెసులుబాటు లభిస్తాయి. సోదరులు, ఆత్మీయులతో పరస్పర అనుబంధం మరింత బలపడుతుంది. చేపట్టే ప్రయాణాలు ఆశించిన ప్రయోజనాలను అందిస్తాయి. వ్యక్తిగత విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలి. ధైర్యం, దూరదృష్టి, వివేకంతో వ్యవహరిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. శ్రీ సూర్యనారాయణస్వామి ఆరాధన శుభఫలితాలను ప్రసాదిస్తుంది.