Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టు సాగుకు అడ్డంకులు.. రైతుల రాస్తారోకో

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:42 PM మంచిర్యాలGeneral
పట్టు సాగుకు అడ్డంకులు.. రైతుల రాస్తారోకో - Ushodayam
చెన్నూర్ మండలం కిష్టంపేటలో పట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. అటవీశాఖ అధికారులు పంట సాగుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల–చెన్నూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఏళ్లుగా ఇదే వృత్తితో కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు తెలిపారు. తమ జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...