Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనాలపై పోలీసుల నిఘా

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 10:05 AM తూర్పుగోదావరి General
వినాయక నిమజ్జనాలపై పోలీసుల నిఘా - Ushodayam
గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా గురువారం నుంచి జరిగే వినాయక నిమజ్జనాలకు సీతానగరం మండలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. వంగలపూడి, మునికూడలి, బొబ్బిలంక గోదావరి ఘాట్ల వద్ద నిమజ్జనాలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. భక్తులు పోలీసులకు సహకరించి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...