Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీ రద్దీ

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:03 PM హైదరాబాద్General
పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీ రద్దీ - Ushodayam
దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడంతో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద అర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ వైపు 12 టోల్‌బూత్‌లను తెరిచారు. చిట్యాల, చౌటుప్పల్‌లో అండర్‌పాస్ పనులతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

Comments

G
Loading comments...