Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సాయన్న ఆశయాలు ఆదర్శనీయం

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:36 PM వరంగల్General
పండుగ సాయన్న ఆశయాలు ఆదర్శనీయం - Ushodayam
నల్లబెల్లిలో పండుగ సాయన్న 174వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పాండవుల రాంబాబు మాట్లాడుతూ, పేదల పక్షాన నిలిచి పోరాడిన గొప్ప యోధుడు సాయన్న అని కొనియాడారు. అన్యాయాలను ఎదిరించి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...