Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి ఖర్చుల కోసం చైన్ స్నాచింగ్

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 9:57 AM హైదరాబాద్General
పెళ్లి ఖర్చుల కోసం చైన్ స్నాచింగ్ - Ushodayam
హైదరాబాద్‌ గుర్రంగూడలో సహజీవనం చేస్తున్న ఏపీకి చెందిన రమణారెడ్డి, వరలక్ష్మి పెళ్లి ఖర్చుల కోసం చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హస్తినాపురం రాజరాజేశ్వరి ఆలయంలో 66 ఏళ్ల రాములమ్మ మెడలోని 30 గ్రాముల పుస్తెలతాడును అపహరించారు. సీసీ కెమెరాల ఆధారంగా వనస్థలిపురం పోలీసులు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...