Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేటలో బస్సుల ఆలస్యం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:05 PM అనకాపల్లి General
పాయకరావుపేటలో బస్సుల ఆలస్యం - Ushodayam
పాయకరావుపేటలో ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా సెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల రద్దీ పెరిగింది. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో బస్సులు ఆలస్యంగా నడుస్తుండటంతో గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమయపాలన పాటించేలా చూడాలని, అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...