Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో అధ్వానంగా రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:15 AM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో అధ్వానంగా రహదారి - Ushodayam
నరసన్నపేట నుంచి కరగాం, కంబకాయ మీదుగా జలుమూరు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుంతలమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు, మహిళలు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత ఏడాది కాలంగా రహదారి ఇదే పరిస్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మరమ్మతులైనా చేపట్టాలని పది గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...