Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:33 PM నెల్లూరుGeneral
నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన - Ushodayam
ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంగీకరించిన అంశాలను అమలు చేయాలని, రెండో దశలోని 1,450 విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొదటి సర్వీసు నుంచే నిరసన కార్యక్రమం చేపట్టారు. జేఏసీ నాయకులు శంకర్, వెంకటేశ్వర్లు, కృష్ణ, పెంచలయ్యతో పాటు పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...