Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొరిగిన మొక్కజొన్న పంట

Follow Ushodayam on Google
Ganga Sep 25, 2026 12:49 PM పార్వతీపురం మన్యంGeneral
నేలకొరిగిన మొక్కజొన్న పంట - Ushodayam
సీతంపేట (M) గొయిది గ్రామానికి సమీపంలో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. బలమైన ఈదురుగాలులు, వర్షం కారణంగా పొలంలో సాగు చేసిన మొక్కజొన్న మొక్కలు పెద్దఎత్తున నేలకొరిగాయి. పంట చేతికొచ్చే దశలో ఉండటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట మొత్తం నేలవాలడంతో దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...