Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారంలో నీటి పొదుపుపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:30 AM మేడ్చల్ మల్కాజిగిరి General
 నాగారంలో నీటి పొదుపుపై అవగాహన - Ushodayam
నాగారం డివిజన్‌లోని కాలనీల్లో జలమండలి మేనేజర్‌ సాయికిరణ్‌గౌడ్‌ పర్యటించి నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎండలు, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని భూగర్భ జలాల పెంపునకు మళ్లించాలని కోరారు.

Comments

G
Loading comments...