Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోటకొండూరులో అమరవీరులకు నివాళి

Follow Ushodayam on Google
Kiran Sep 15, 2026 1:13 PM యాదాద్రి భువనగిరిGeneral
మోటకొండూరులో అమరవీరులకు నివాళి - Ushodayam
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా మోటకొండూరు మండలంలో అమరవీరులకు నివాళులర్పించారు. మాటూరు, పెద్దబాయి, చాడ, కాటపల్లి గ్రామాల్లోని వీరుల స్థూపాల వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వీరుల త్యాగాలు చిరస్మరణీయమని మండల కార్యదర్శి మాణిక్యం కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు బాలరాజు, నరసింహ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...