Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ కూల్చివేత

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 7:36 AM హైదరాబాద్General
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ కూల్చివేత - Ushodayam
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల, దూలపల్లి గ్రామాల పరిధిలోని ఫాక్స్‌సాగర్ చెరువు ఆక్రమణలపై హైడ్రా అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన 15 ఎకరాల స్థలం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లు గుర్తించి ఫామ్‌హౌస్ ప్రహరీ గోడను తొలగించారు. చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఈ ఆక్రమణల తొలగింపు చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...