Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరిలో దసరా షాపింగ్‌ సందడి

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:29 PM మేడ్చల్ మల్కాజిగిరి General
మల్కాజిగిరిలో దసరా షాపింగ్‌ సందడి - Ushodayam
దసరా పండుగ వేళ మల్కాజిగిరి ప్రధాన రహదారిపై షాపింగ్‌ కోలాహలం నెలకొంది. రోడ్డుకు ఇరువైపులా తాత్కాలిక దుకాణాలు వెలవడంతో బట్టలు, బొమ్మలు, పూజా సామగ్రి కొనుగోలుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆటోలు, బైకులు, కార్లతో రహదారి రద్దీగా మారింది. ట్రాఫిక్‌ పోలీసులు రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఫ్లెక్సీలు, తోరణాలతో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది.

Comments

G
Loading comments...