Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

Follow Ushodayam on Google
B RAJESH Sep 16, 2026 7:07 PM విజయనగరంGeneral
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ - Ushodayam
పూసపాటిరేగ మండలం పెదనడిపల్లి గ్రామానికి చెందిన శీల రమ (37) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను నిందితుడిగా అరెస్టు చేసినట్లు SP దామోదర్ బుధవారం తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో ఏర్పడిన వివాదంతో రమను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని, రిమాండు తరలించామన్నారు.

Comments

G
Loading comments...