Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం డిమాండ్‌పై ఎస్సైపై కేసు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:16 AM హైదరాబాద్General
లంచం డిమాండ్‌పై ఎస్సైపై కేసు - Ushodayam
హైదరాబాద్ బంజారాహిల్స్ ఎస్సై కొత్తూర్ విజయ్‌పై లంచం డిమాండ్ ఆరోపణలతో అనిశా అధికారులు కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు నిందితుడిని తొలుత రూ.10 లక్షలు, మరో కేసులో రూ.2 లక్షలు ఇవ్వాలని కోరినట్లు ఆరోపణలున్నాయి. నిందితుడి ఫిర్యాదుతో బుధవారం డీఎస్పీ గంగస్వామి శ్రీధర్ ఎస్సైని అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం తీసుకోకపోయినా డిమాండ్ చేయడం నేరమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...