Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతలు మొదలైనా.. కానరాని కొనుగోలు కేంద్రాలు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:21 AM సూర్యాపేటGeneral
కోతలు మొదలైనా.. కానరాని కొనుగోలు కేంద్రాలు - Ushodayam
అనంతగిరి మండలాన్ని ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించింది. గతేడాది 22 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి వర్షాభావంతో 14 వేల ఎకరాలకే పరిమితమైంది. ఇప్పటికే వెయ్యి ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. అయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...