Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీలలో పరివర్తనే లక్ష్యం

Follow Ushodayam on Google
Ganga Oct 02, 2026 6:51 PM పార్వతీపురం మన్యంGeneral
ఖైదీలలో పరివర్తనే లక్ష్యం - Ushodayam
ఖైదీలలో మానవతా విలువలు, పశ్చాత్తాపం పెంపొందించి సానుకూల పరివర్తన తీసుకురావడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సబైలులో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఖైదీలు కూడా సమాజంలో భాగమే అని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

Comments

G
Loading comments...