Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేటలో బడికి వెళ్లే దారి దుస్థితి

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 12:08 PM కడపGeneral
ఖాజీపేటలో బడికి వెళ్లే దారి దుస్థితి - Ushodayam
ఖాజీపేట మండలంలోని సర్వర్ఖాన్‌పేట, పత్తూరు గ్రామాల్లో చిన్నపాటి వర్షానికే వీధులు జలమయమవుతున్నాయి. వర్షపు నీరు రోజుల తరబడి నిలిచిపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ఖాన్‌పేట ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారిలో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...