Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో ఘనంగా వాసవి మాత బిందె సేవ

Follow Ushodayam on Google
Anuroop Oct 16, 2026 3:17 PM కడపGeneral
కడపలో ఘనంగా వాసవి మాత బిందె సేవ - Ushodayam
దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా కడపలో వాసవి మాత బిందె సేవను ఘనంగా నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం, అమ్మవారి శాల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అమ్మవారిని బిందెపై అలంకరించి ఆలయం నుంచి పలు వీధుల మీదుగా ఊరేగించారు. దారిపొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...