Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోర్డాన్‌లో కాల్పులు.. ఏడుగురి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:08 PM అంతర్జాతీయంGeneral
జోర్డాన్‌లో కాల్పులు.. ఏడుగురి మృతి - Ushodayam
జోర్డాన్‌లోని కరాక్ గవర్నరేట్‌లో అంత్యక్రియలు జరుగుతున్న చర్చిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. హమూద్ చర్చివద్ద వాహనంలో వచ్చిన దుండగులు అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. దాడికి గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Comments

G
Loading comments...