Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీటీసీ అభ్యర్థికి భారీ ఆస్తులు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 7:01 AM చిత్తూరుGeneral
జడ్పీటీసీ అభ్యర్థికి భారీ ఆస్తులు - Ushodayam
చిత్తూరు జిల్లా గుడిపాల తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి మమత శ్రీ కుటుంబానికి రూ.172.27 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇందులో రూ.9.28 కోట్ల చరాస్తులు, రూ.162.99 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. మమత శ్రీకి రూ.43.64 కోట్లు, భర్త ఈశ్వర నాయుడికి రూ.119.80 కోట్ల స్థిరాస్తులున్నాయి. కుటుంబానికి 44.62 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, దంపతుల పేరిట రూ.32 కోట్ల రుణాలున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...