Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు బిడ్డలకు ఉరేసి తల్లి ఆత్మహత్య

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 7:04 AM వికారాబాద్General
ఇద్దరు బిడ్డలకు ఉరేసి తల్లి ఆత్మహత్య - Ushodayam
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వాసవి అనే మహిళ తన ఇద్దరు కుమారులు సహర్షరెడ్డి, వేదార్షరెడ్డిలకు ఇంట్లో ఉరివేసి, ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వారాంతపు సెలవుల కోసం వికారాబాద్ నుండి సొంత ఊరికి వచ్చిన సమయంలో ఈ ఘతుకం జరిగింది. ఘటనపై వాసవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...