Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో తాగునీటి అంతరాయం

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 21, 2026 9:54 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో తాగునీటి అంతరాయం - Ushodayam
మంజీరా ఫేజ్–2లో బీరంగూడ కమాన్ వద్ద మెయిన్ పైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడింది. జలమండలి అత్యవసర మరమ్మతులు చేపట్టి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మరమ్మతుల అనంతరం దశలవారీగా నీటి సరఫరా పునరుద్ధరిస్తారు. లీకేజీ ప్రభావంతో ఆర్సీపురం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...