Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 10:59 AM అనంతపురంGeneral
గుత్తిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి - Ushodayam
అనంతపురం జిల్లా గుత్తిలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువు కట్ట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో గుత్తికి చెందిన భార్గవ్, పురుషోత్తమ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్గవ్ రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగి కాగా, పురుషోత్తమ ఐటీఐ విద్యార్థి.

Comments

G
Loading comments...