Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిబండలో మహిళల ధర్నా

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 10:24 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గుడిబండలో మహిళల ధర్నా - Ushodayam
గుడిబండ మండలం దేవరహట్టి పి.గొలహట్టి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని మహిళలు, గ్రామస్థులు బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కేశవరెడ్డి అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు.

Comments

G
Loading comments...