Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రిడ్‌కు అనుసంధానమైన మెగావాట్ సోలార్ ప్లాంట్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:42 PM పెద్దపల్లి General
గ్రిడ్‌కు అనుసంధానమైన మెగావాట్ సోలార్ ప్లాంట్ - Ushodayam
సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సామర్థ్య సోలార్ ప్లాంట్‌ను విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానించినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం రాఘవపూర్ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో సింక్రనైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో నాలుగు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయిందని, వచ్చే వారం ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అధికారుల సమష్టి కృషిని అభినందించారు.

Comments

G
Loading comments...