Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామసభలో అధికారుల తీరుపై ఆగ్రహం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:36 PM మెదక్General
గ్రామసభలో అధికారుల తీరుపై ఆగ్రహం - Ushodayam
రామాయంపేట మండలం దామరచెరువులో భూభారతి భూముల రీ సర్వేపై నిర్వహించిన గ్రామసభలో అధికారుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సర్వేలో ప్రభుత్వ భూములుగా చూపిన ప్రాంతాల్లో ఆక్రమణలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. మళ్లీ రీ సర్వే పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు అవకాశం కల్పిస్తారా అంటూ అధికారులను ప్రశ్నించారు. భూముల విషయంలో న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...