Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో కోతుల స్వైరవిహారం

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:54 AM నల్గొండGeneral
గ్రామాల్లో కోతుల స్వైరవిహారం - Ushodayam
తెలంగాణలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్రంలోని 10,995 గ్రామ పంచాయతీల్లో 6,112 గ్రామాలు కోతుల సమస్యతో సతమతమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 5,660 గ్రామాల్లో పంట నష్టం నమోదైంది. మరో 4,380 గ్రామాల్లో ప్రజలు కోతుల దాడులతో భయాందోళనకు గురవుతున్నారు. పంటల రక్షణకు రైతులు కాపలా కాస్తున్నారు. కోతుల నియంత్రణకు గతంలో ప్రకటించిన పునరావాస కేంద్రాలు ఇంకా ఏర్పాటు కాలేదు.

Comments

G
Loading comments...