Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవింద్‌పేట్‌లో కొమురం భీం జయంతి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:28 AM నిజామాబాద్General
గోవింద్‌పేట్‌లో కొమురం భీం జయంతి - Ushodayam
ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌లో గురువారం కొమురం భీం జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి గ్రామ పెద్దలు, యువకులు పూలమాలలు వేసి నివాళులర్పించి, గ్రామంలో ర్యాలీ చేపట్టారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీం చేసిన పోరాటాన్ని వక్తలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...