Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్రవాహనంపైనే గుండెపోటు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:23 AM జనగామ General
ద్విచక్రవాహనంపైనే గుండెపోటు - Ushodayam
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన బోడ లింగం(49) ద్విచక్రవాహనంపై వెళ్తూ గుండెపోటుతో మృతి చెందారు. బోరు మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్న ఆయన బుధవారం జనగామలో మరమ్మతులు పూర్తిచేసుకుని స్వగ్రామం ఇటుకాలపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. సిద్దిపేట రోడ్డు వంతెన వద్ద ఒక్కసారిగా కుప్పకూలారు. వాహనదారులు సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. పోలీసులు మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...