Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు

Follow Ushodayam on Google
Dinesh Kumar Sep 28, 2026 7:41 PM చిత్తూరుGeneral
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు - Ushodayam
ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని బంగారుపాళ్యం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.50 లక్షల విలువైన నాలుగు దొంగిలించిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన విగ్నేష్, చంద్రు భీమన్, విజయ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరాలకు ఉపయోగించిన మరో బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...