Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరలు అసాధారణంగా పెరిగితే జోక్యం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:24 AM హైదరాబాద్General
ధరలు అసాధారణంగా పెరిగితే జోక్యం - Ushodayam
తెలంగాణలో నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరిగితే మార్కెట్‌లో జోక్యం చేసుకుంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఫైన్ రకం బియ్యం ధరలు 15 శాతం వరకు పెరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో బియ్యం కొరత లేదని, వచ్చే ఏడాది అక్టోబర్ వరకు సరిపడా నిల్వలున్నాయని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వ నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసి ధరలను నియంత్రిస్తామన్నారు.

Comments

G
Loading comments...