Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మికలో రోడ్డెక్కిన ఏనుగుల గుంపు

Follow Ushodayam on Google
B Ganga Aug 28, 2026 9:56 PM పార్వతీపురం మన్యంGeneral
బొమ్మికలో రోడ్డెక్కిన ఏనుగుల గుంపు - Ushodayam
భామిని మండలంలోని బొమ్మిక రహదారిపై శుక్రవారం ఏనుగుల గుంపు సంచరించడంతో కలకలం రేగింది. గుంపుగా వచ్చిన ఏనుగులు రహదారిని దాటుతుండటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది సూచించారు. తరచూ ఏనుగులు జనావాసాలు, రహదారుల వైపు వస్తున్నందున వాటికి దగ్గరగా వెళ్లకుండా సురక్షిత దూరం పాటించాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...