Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజ్వారంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Follow Ushodayam on Google
Kiran Sep 10, 2026 2:55 PM జోగులాంబ గద్వాల్ General
బిజ్వారంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు - Ushodayam
మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో రజక కమిటీ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ఒక కులానికి పరిమితం కాదని, మహిళాలోకానికి స్ఫూర్తిదాయకమని తిరుమలేష్ అన్నారు. దొరల దౌర్జన్యాలను ఎదిరించి పేదల కోసం పోరాడిన ధీరవనితగా ఐలమ్మను కొనియాడారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...