Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసారం పెంపుపై రైతులకు అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:23 PM పెద్దపల్లి General
భూసారం పెంపుపై రైతులకు అవగాహన - Ushodayam
ఖేత్‌ బచావో అభియాన్‌లో భాగంగా రామగిరి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆదివారంపేటలో సాగుభూమి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులను అధికంగా వాడటం వల్ల నేలలో భూసారం తగ్గుతుందని ఏవో చిందం శ్రీకాంత్‌ తెలిపారు. భూసారం పెంచేందుకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఇల్లందుల సంజీవ్‌, ఏఈవోలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...