Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజలో 108, 102 అంబులెన్సుల తనిఖీ

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:03 PM జోగులాంబ గద్వాల్ General
అయిజలో 108, 102 అంబులెన్సుల తనిఖీ - Ushodayam
అయిజలో మంగళవారం రాష్ట్ర క్వాలిటీ ఆడిటర్ ఫకీర్ దాస్, గద్వాల జిల్లా మేనేజర్ రత్నమయ్యతో కలిసి 108, 102 అంబులెన్సులను తనిఖీ చేశారు. వైద్య పరికరాలు, మందుల గడువు తేదీలు, వాహనాల నిర్వహణ, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అత్యవసర వాహనాల సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఫకీర్ దాస్ సూచించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ ఇస్రాయెల్, పైలెట్లు శ్రీధర్, భార్గవ్, హమీద్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...