Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులకే పెన్షన్లు అందేలా వెరిఫికేషన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 06, 2026 2:18 PM వనపర్తిGeneral
అర్హులకే పెన్షన్లు అందేలా వెరిఫికేషన్‌ - Ushodayam
అర్హులైన లబ్ధిదారులకే పెన్షన్లు అందేలా పారదర్శకంగా వెరిఫికేషన్‌ నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ సూచించారు. మంగళవారం రేవల్లి మండలం తల్పనూరు, రేవల్లి గ్రామాల్లో పెన్షన్‌ వెరిఫికేషన్‌ను పరిశీలించారు. చేయూత దరఖాస్తుల్లో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...