Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతలో వృథాగా పోతున్న తాగునీరు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:08 PM వనపర్తిGeneral
అమరచింతలో వృథాగా పోతున్న తాగునీరు - Ushodayam
అమరచింత మున్సిపాలిటీలోని ఒకటో వార్డు దశమి కట్ట పశువుల ఆసుపత్రి వద్ద కొన్ని రోజులుగా తాగునీరు వృథా అవుతోంది. ఆసుపత్రి ప్రహరీ గోడ పక్కన ఉన్న కొళాయి నుంచి నిత్యం నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. నీటి వృథాను అరికట్టాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...